కమలముఖి, శ్రీమాత;- కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:-99127 67098
 🪷కమల ముఖివి నీవె!
చంద్ర సోదరివి నీవె!
     అమృతాబ్ధి పుత్రి వీవె!   
జయజయ నారాయణి!
      ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ., )
      కమల మనగా పద్మము, తామర పువ్వు! శ్రీదేవి.. కమలంతో సమానమైన ముఖ వర్చస్సు వెలుగొందు చున్నది! క్షీరసాగర మనగా పాలసముద్రము.. జన్మభూమిగా కలది! అందులో.. ఆవిర్భవించడం  వలన చంద్రుడు, అమృతము ... లక్ష్మీదేవికి సోదరులు! ఆమె .. నారాయణునకు ప్రాణేశ్వరి! కనుక, "నారాయణి" యైనది .. శ్రీమాత!
🚩 ప్రార్థన శ్లోకము
    నమోస్తు నాళీక నిభాననాయై
    నమోస్తు దుగ్గోదధి జన్మభూమ్యై 
    నమోస్తు సోమామృత సోదరాయై 
    నమోస్తు నారాయణ వల్లభాయై!
          [ జగద్గురు ఆదిశంకరులు విరచితం, శ్రీ కనక ధారా స్తవము., 14.వ.శ్లోకము ,]
      🚩చంపక మాల:-
     కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత! దండముల్ !
     కమల సమాన మాననము కాంతిలు కాంత దృగంత! దండముల్! 
   అమృత లసత్కరామృత రసాప్త సహోదరి! లక్ష దండముల్!
     అమృత సరిత్ ప్రియామిత ప్రియాత్మభవా! సిరి! కోటి దండముల్!!
  
     [రచన:- వెలుదండ సత్యనారాయణ, పరమార్థ కవి,]
     ఓం శ్రీమాత! జయ శ్రీమాత! జయజయ శ్రీమాత!

కామెంట్‌లు