నమస్కార ప్రియుడు - దివాకరుడు [అష్టాక్షరీ గీతికలు] "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి:- 99127 67098
  శ్రీసూర్య భగవాన్! మేము
 రెండు చేతులు జోడించి
      నమస్కరింతుము స్వామి!
  ప్రభాకర! నమో హర!
              🪷 (2)        
      నవ్యదివ్య  ప్రభలతో
  వెలుగొందు స్వామి వీవె!
      ప్రత్యక్ష పరమేశ్వర!
  దివాకర! నమో హర!
               🪷 (3)                      
      "దివ"మనగా పగలు
  కలుగ జేయు వాడవు!
      "దివాకరుడవు" నీవె!
  ప్రభాకర! నమో హర! (4)  
               🪷 (4) 
      సమస్త జీవరాశిని
  చైతన్యవంతం కావించు
       సూర్య భగవానుడవు!
  దివాకర! నమో హర!
   🚩ఓం ఈశానాయ, సూర్యమూర్తయే నమః!
కామెంట్‌లు