🪷భక్తి ప్రపత్తుల తోను
సేవించెడి భక్తులము!
నిన్నే నమ్మితిమి శివ!
చంద్రశేఖర! పాహిమాం!
🪷శాపగ్రస్తుని చంద్రుని
కళలు పెంపొందించిన
వామదేవుడవు నీవె!
చంద్రశేఖర! పాహిమాం!
[అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,]
⚜️చంద్రుడు.. అమృత కిరణములు కలవాడు! తారలకు అధిపతి! సప్త దినాధిపతులలో ఒకడు! అటువంటి చంద్రుణ్ణి శిరోభూషణంగా జటాజూటం నందు కలిగిన వాడు! కనుక, చంద్రశేఖరుడు!
🔱శివో మహేశ్వర శ్శంభు:
పినాకీ "శశిశేఖర:"! అని,...
శ్రీ శివాzష్టోత్తర శత నామస్తోత్రము నందు; పరమేశ్వరుని ప్రస్తుతించారు, విష్ణుమూర్తి!
⚜️పరమశివుని ఆర్తితో ప్రార్థించిన వారికి... కష్టనష్టములు పోగొట్టు చున్నాడు! భక్తితో పూజించినవారికి, మనోభీష్టములు నెరవేర్చ చున్నాడు! కనుక, భక్త వశంకరుడు, శంకర భగవానుడు!
🚩ఉత్పలమాలా వృత్తం
( వాణీ, పద్మా, అంబా, రతీ, దరధ్వని తాళగర్భిత మైనదీ పద్యము.)
🚩 ఉత్పల మాల:-
సామము సంకటం బొసగ సాయము కోరితి చంద్రశేఖరా!
వామము ప్రాకృతం బవగ బాయగ కోరితి ఫాలనేత్రుడా!
నామది నైకధా యనగ నాయము కోరితి నాగభూషణా;
నీమము నీకెగా ననిగి నేయము కోరును నీలకంధరా!
(👌ఈ ఉత్పల మాల పద్యంలో... వాణీ , పద్మా , అంబా, రతీ, దరధ్వని తాళ గర్భితముగా పద్యములను ... పేర్కొనబడినవి )
🪷వాణీ (ర న భ భ ర వ, 13 యతి)
సంకటం బొసగ సాయము కోరితి చంద్రశేఖరా!
ప్రాకృతం బవగ బాయగ కోరితి ఫాలనేత్రుడా!
నైకధా యనగ నాయము కోరితి నాగభూషణా!
నీకెగా ననిగి నేయము కోరును నీలకంధరా!
🪷పద్మా: (సససజగ, 9 యతి)
సగ సాయము కోరితి చంద్రశేఖరా!
వగ బాయగ కోరితి ఫాలనేత్రుడా!
నగ నాయము కోరితి నాగభూషణా!
నిగి నేయము కోరును నీలకంధరా !
🪷అంబా (భభరవ, 7 యతి)
సాయము కోరితి చంద్రశేఖరా!
బాయగ కోరితి ఫాలనేత్రుడా!
నాయము కోరితి
నాగభూషణా!
నేయము కోరును నీలకంధరా!
🪷రతీ:- (భరవ)
కోరితి చంద్రశేఖరా!
కోరితి ఫాలనేత్రుడా!
కోరితి నాగభూషణా!
కోరును నీలకంధరా!
🪷దరధ్వని తాళ వృత్తము , (రన ) యతిలేదు
సంకటం బొసగ
ప్రాకృతం బవగ
నైకధా యనగ
నీకెగా ననిగి
( పద్య రచన:- బొలిశెట్టి సత్య నారాయణ.,)
🔱 చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర! పాహిమాం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి