స్నేహ బంధం;-సి.హెచ్.ప్రతాప్
 దిన దిన ప్రవర్ధమనమవుతూ
వయో, జాతి ,మత ప్రాంతీయ బేధాలు లేక
స్నేహ సుగంధాన్ని, అనిర్వచనియమైన ఆనందాన్ని
పంచి పెట్టేదే స్నేహ బంధం
కష్టాలను ఇష్టాలుగా
ఆపదలను సంపదలుగా
దుఖాలను సుఖాలుగా మార్చగలిగేది
స్నేహబంధం ఒక్కటే
శోకాన్ని పోగొట్టి
ఒంతరితనపు చీకట్లను పారద్రోలి
ప్రీతి విశ్వాసాలకు పాత్రుడవుతూ
సదా హితం కోరుతూ
అన్ని వేళలా వెన్నంటి వుండేవాడే స్నేహితుడు
చీకటిపడితే మన నీడే మనల్ని వీడుతుంది
స్నేహం ఎప్పుడూ మనతోనే ఉంటుంది
మదిలోని మంచితనానికి మరణం లేదు
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు
అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు
భాష లేనిది, బంధమున్నది
సృష్టిలో అతి మధురమైనది
జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే
వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే
స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం
కామెంట్‌లు