మార్పు కథల పుస్తక ఆవిష్కరణ.

    ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తడపాకల పాఠశాలలో  ఏడవ తరగతి చదువుతున్న నూకల వైష్ణవి రచించిన "మార్పు"కథల పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అబ్దుల్ జావిద్ గారి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. మంచి సందేశం తో కూడిన 21 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ఇంత చిన్న వయసులోనే సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని, ఈ కథల పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు చక్కని పుస్తకాన్ని రాసిన వైష్ణవిని పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సుధాకర్, గంగాధర్, నాగప్ప, కృష్ణ ప్రసాద్, నరేందర్, స్వప్న సుజాత విజయ పాల్గొన్నారు
కామెంట్‌లు