బాలల పుస్తకాలు ; -. కోరాడనరసింహా రావు!
బాల ల  పుస్తకాలంటే... 
 బొమ్మలతో కధలు.... 
 గేయాలతో బొమ్మలు...! 
 చూడ గానే.. పిల్లలనే కాదు... 
 పెద్ద లనూ ఇట్టే ఆకట్టు కుంటాయి..!! 
 జంతు వులతో కధ లు... 
 పక్షు లతో గేయాలు... 
 అపాయాలలో ఉపాయాలవి
  ఎన్నె న్నో ...! 
 తెలివైన కుందేళ్లు... 
 జిత్తుల మారి నక్కలు... 
 బలమైన జంతువులనుండి
  బల హీన ప్రాణులు... 
  తెలివిగా తప్పించుకునే విధానాలు...! 
  టక్కరి మొసలి నుండి... 
 తెలివిగా తప్పించుకునేకోతి..! 
  ఎన్నెన్ని నీతి కధలు.... 
  కోయిల కే పాటలు 
 నెమలికే నాట్యాలు
 హంసలకే నడకలు
 చిలుకలకే పలుకులు... 
  నేర్పే ముచ్చట గొలిపే పిల్లలు
 వినోదం తో  విజ్ఞానం
 విజ్ఞానం లో  వినోదం..! 

కధలు... ఆట - పాట లతోనే... 
 చదువు.....! 
 పుస్తకాల నిండా... నైతికతె..!! 

రేపటి ఉత్తమ పౌరులుగా... 
 చక్కగా తీర్చి దిద్దే ఇట్టి బాలల
 పుస్త కాలను చదువు దా0... 
 పిల్లలచే చదివిద్దా0... ।
     ******
.
కామెంట్‌లు