46)చక్రగదాధరః -
సుదర్శనచక్రo ధరించినవాడు
గదాధరుడై యున్నట్టి వాడు
మహా విష్ణువుగా వెలసినవాడు
విశ్వభారము వహించినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
547)వేధాః -
సృష్టిని జరిపించగలవాడు
ప్రారంభము చేయునట్టివాడు
విద్వాంసునిగా వెలుగువాడు
బ్రహ్మ, విష్ణు స్వరూపమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
548)స్వాంగః -
సృష్టియంతటినీ జరుపువాడు
సాధనాలు సమకూర్చుకొనువాడు
అంతయు తానే అయినవాడు
సాంగోపాంగములయినట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
549)అజితః -
ఎవ్వరికీ తలనొగ్గనివాడు
గెలువబడని తీరున్నవాడు
పరాజయమును ఎరుగనివాడు
అజేయమైనట్టి బలమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
550)కృష్ణః -
నీలమేఘరూపునయున్నవాడు
శ్యామసుందరనామమున్న వాడు
నల్లనిఛాయను గలిగినవాడు
కృష్ణపరమాత్మ తానైనవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి