శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )--ఎం. వి. ఉమాదేవి
576)సామః -

సామవేదము తానైనట్టివాడు 
అనుకూల ప్రవర్తననున్నవాడు 
మంచిమాటలాడుచున్నవాడు 
పరస్పరఉపయోగం తెల్పువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
577)నిర్వాణః -

శాంతిని ఒసగునట్టివాడు 
ముక్తిని ప్రసాదించగలవాడు 
చల్లబర్చుచున్నట్టి వాడు 
సమస్తదుఃఖముతీయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
578)భేషజం -

భవరోగముల హరణకుడు 
వ్యాధినిర్మూలన చేయువాడు 
భేషజమునిచ్చుచున్న వాడు 
చిక్కులు తొలగించునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
579)భిషక్ -

వైద్యునిగా యున్నట్టివాడు 
ఓషధులను ప్రసాదించువాడు 
రోగనిర్మూలనము చేయువాడు 
మహా భిషక్కునిగా నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
580)సన్యాసకృత్ -

సన్యాసవ్యవస్థ నుంచినవాడు 
కామ్యకర్మలను విడిచినవాడు 
ఆశ్రమజీవితమున్నట్టివాడు 
భక్తులసమూహములున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు