తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
 ప్రపంచ చరిత్రలో 1923కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రాచీన నగరం ఉర్ అనేది మొసపొటేమియా ప్రాంతం లో కనుగొనబడింది.ఆప్రజల్ని సుమేరియన్ అన్నారు.ఎన్నో రాజప్రాసాదాలు తోటలు బడులు నిర్మిం చారు.1923లో ఆర్కియాలజిస్ట్ లియోనార్డో ఊలీ పరిశోధన లో ఇది బైటపడింది.త్రవ్వకాలలో  రాజుల సమాధులు కూడా కనపడ్డాయి.రాణి రాజులు వారి నౌకర్లు చాకర్లు బంగారం ధనం కూడా ఉన్నాయి.చరిత్రలో ఉరు అత్యంత వైభవంగా ప్రాచీన నాగరికత ఉన్న నగరంగా నిల్చింది.ఎల్ డొరాడో అనే ప్రాంతం దక్షిణ అమెరికా లో ఉండేది.స్పానిష్ అన్వేషకులు అక్కడ బోలెడంత బంగారం సంపద ఉంది అని కనుగొన్నారు.19 వశతాబ్దిలో ఆటవిక జాతులు అపురూప ఖనిజాలు వాడుతున్నట్లు గుర్తించారు.ఆనాటి గుడి గోపురాలు సమాధుల్లో అలంకారం కి బంగారం ని వాడారు.అప్పటికి ఇనుము తెలీదు.పాత్రలు కంచాలు దువ్వెన మొదలైనవన్నీ బంగారం తో తయారు ఐనవే! నిజంగా అద్భుతం గా అనిపిస్తుంది కదూ?🌹
కామెంట్‌లు