త్యాగం సేవకు మారుపేరు! అచ్యుతుని రాజ్యశ్రీ

 తక్కువ కాలంలో ఎక్కువ కీర్తి నెలకు 50వేల ఆదాయం 6 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆదర్శం కవితాహృదయమున్న ఆయన బాల్యం దివాలా తీసిన తండ్రి కి పెద్ద కొడుకు గా 1870 నవంబర్ 5న జన్మించారు.ఆటపాటల్లో మేటి.లండన్ లో బార్ ఎట్ లా పట్టాతో కోర్టుకి కాలినడకన వెళ్లారు.అరవింద్ ఘోష్(మహర్షి అరవిందుని) ఆయనసోదరుని నిర్దోషులుగా నిరూపించారు .10 నెలలపాటు
పోరాడి చేత చిల్లిగవ్వ లేకుండా పోయినా బాధపడని వ్యక్తిత్వం ఆయనది.తండ్రిబాకీలను తీర్చారు.బెంగాలీ సాహితీ వేత్తగా గుర్తింపు పొందారు.ఫార్వర్డ్ అనే ఆంగ్ల పత్రికను నడిపారు.
కలకత్తా మేయర్ గా " నేనే అతిగొప్ప యాచకుడిని"
అని అందర్నీ నవ్వించే వారు.బ్రిటిష్ యువరాజు రాకను వ్యతిరేకించిన ఆయనను అరెస్టు చేశారు.
జైల్లో వినోదం కోసం నాటక ప్రదర్శన ఏర్పాటు చేసిన ఘనులు . సామాన్య ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే నేను కోరుతాను.స్వతంత్రభారతం అందుకే కావాలి" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు.
2 కోల్కతా మేయర్ గా ఉచిత విద్య వైద్య సాయం పరిశుభ్రత చిన్న బస్తీల్లో  పేదలకు ఉచిత గృహ వసతికై ఆయన చేసిన కృషి అమోఘం.ఆరోజుల్లోనే
4లక్షలవిలువైన తన ఇంటిని సేవాసదన్ గా అంకితం చేశారు.15జూన్ 1925 లో కేవలం 55ఏళ్ల వయసులో పరమపదించారు.5లక్షలమంది పాల్గొన్న అంతిమ యాత్ర లో యూరోపియన్లు కూడా పాల్గొన్నారు.అలాంటి మహా వ్యక్తి చిరస్మరణీయుడు..ఆయనే దేశ బంధు చిత్తరంజన్ దాస్.ఆనాటి కోట్లకి పడగలెత్తిన విదేశీయుల మన్ననలను పొందిన త్యాగమూర్తి.తల్లిదండ్రులు నిస్తారిణీదేవి భువనమోహనదాసు.తాత తండ్రి బాబాయిలు అంతా న్యాయ వాదులు.
కామెంట్‌లు