న్యాయాలు -482
గర్ధభ రోమ గణన న్యాయము
*****
గర్ధభ అనగా గాడిద.రోమ అనగా వెంట్రుకలు.గణన అనగా ఎన్నిక ,లెక్కించుట అనే అర్థాలు ఉన్నాయి.
గాడిద ఒంటిమీద ఉన్న వెంట్రుకలను లెక్కించుట అని అర్థము.
గాడిద ఒంటి మీద ఉన్న వెంట్రుకలు లెక్కించడం అనేది పని లేని వాడు చేసే పనికి మాలిన పని.
దీనినే తెలుగులో "పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు" అంటారు.
అయితే ఇందులో కూడా రెండు రకాల అర్థాలు యిమిడి ఉన్నాయి. ఒకటేమో ఏ పనీ లేని వారు ఉబుసుపోక చేసే పని అని అర్థము.రెండవదేమో ప్రజల మెప్పు కోసం ఏదో ఒక పని చేస్తున్నట్లు చేయడం తప్ప దాని వల్ల ఎవరికీ ఆవగింజంత ఉపయోగం ఉండదని మరో అర్థము.
అలా గాడిద వెంట్రుకలు లెక్కించడం కూడా అలాంటిదే.అందుకే అలాంటి వారిని ఉద్దేశించి మన పెద్దవాళ్ళు ఈ "గర్ధభ రోమ గణన న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
కొంతమంది ఏదో పని చేస్తూ వున్నట్లు కనిపిస్తుంటారు.వాళ్ళు చేసే పని గురించి తెలియనప్పుడు "భలే శ్రమ జీవులండీ వీళ్ళు. పాపం క్షణం తీరిక లేకుండా పనులు చేస్తున్నారు" అనుకుంటాం. కానీ అసలు విషయం( వాళ్ళు చేస్తున్న పని)తెలిసాక మనకు నవ్వు, కోపం, అసహనం అన్నీ మిళితమై ఓకే సారి ముప్పిరిగొని వచ్చేస్తాయి.
ఇలాంటి సామెతకు దగ్గరగా మన తెలుగు వాళ్ళు ఇంకో సామెతను కూడా చెబుతుంటారు. "తోచీ తోచనమ్మ తోటి కోడలు తల్లి గారింటికి వెళ్ళిందట".. తోటి కోడలు అంటే ఏరాలు. సాధారణంగా ఉమ్మడి కుటుంబాల్లో తోటి కోడండ్ల మధ్య సఖ్యతే సరిగా వుండదు.కనిపించని ద్వేషాలు, పగలు ఉంటాయి.ఒకరి అభివృద్ధి చూసి మరొకరు హర్షించే గుణం వుండదు.అందుకే "ఏరాలు హెచ్చనీయదు సవితి సాగనీయదు" అని సామెతను వాడుతారు కదా!
అలాంటిది ఏకంగా ఏరాలు తల్లి గారింటికి పోవడం అనేది జరుగుతుందా?జరుగదు.అలా పోయిందంటే ఆమె ఖచ్చితంగా అమాయకురాలే అయి ఉండాలి.
అదే విధంగా గాడిద వెంట్రుకలు లెక్కించే వాడు కూడా అమాయకుడైనా అయి ఉండాలి లేదా కష్టించి చేయాల్సిన పనిని తప్పించుకునే సోమరి అయినా అయి ఉండాలి.చేసేందుకు ఏ పనీ లేక ఖాళీగా ఉండలేక చేసే పనైనా అయి ఉండాలి. లేదా ఏదో చేస్తున్నట్లు అందరికీ కనిపించాలనే పిచ్చి ఆరాటమైనా అయి ఉండాలి.అంతే కదండీ!.
"గర్ధభ రోమ గణన న్యాయము" ఏమో గానీ ఈ సందర్భంగా కొన్ని సామెతలను ముచ్చటించుకునేందుకు అవకాశం వచ్చింది.
ఎవరి కోసమో మనం నటించక్కర లేదు. మన సమయాన్ని ఈ న్యాయములా వృధా చేసుకోకుండా మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఏదైనా సరే కొంటే దొరుకుతుందేమో కానీ సమయం దొరకదు కదా!
అందుకే గర్ధభ రోమ గణన చేసేవారిని మార్చే విధంగానైనా చూద్దాం. లేదంటే మన అమూల్యమైన కాలాన్ని వాళ్ళ కోసం వెచ్చించకుండా మనం చేయాల్సిన మంచి పనులేవో చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి