శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
606)శ్రీశః -

సిరులకు అధిపతియైనవాడు 
లక్ష్మికి నాథుడైయున్నవాడు 
ఐశ్వర్యమూలమైనట్టి వాడు 
శ్రీలకు స్థానముగారాజిల్లువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
607)శ్రీనివాసః -

నివాసములో లక్ష్మియున్నవాడు 
శ్రీ వేంకటేశ్వర నామమున్నవాడు 
సప్తగిరులలో కొలువైనవాడు 
భక్తులకు అందునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
608)శ్రీ నిధిః -

ఐశ్వర్యముకు నిధివంటివాడు 
సంపదల మాళిగయినట్టివాడు 
భక్తులకోరికలు తీర్చగలవాడు 
ఆధ్యాత్మిక నిధి అయినట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
609)శ్రీ విభావనః -

సిరులను పంచునట్టివాడు 
సంపద వితరణ చేయువాడు 
ధనపరిచయము చేయువాడు 
కలిమికారణమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
610)శ్రీధరః -

వక్షమందు శ్రీదేవి గలవాడు 
విష్ణువుగా వెలసినట్టి వాడు 
బుద్ధదేవుడు తానైనవాడు 
సిరులను కలిగియున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు