అరటిపండు స్వగతం;- సి.హెచ్.ప్రతాప్
 నా పేరే అరటి పండు. సోడియం, పొటాషియం వంటి ఎన్నో విలువైన పోషక పధార్ధాలను కలిగి వున్న నేనంటే పుట్టిన పాపాయి నుండి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఇష్ట పడతారు.రక్త లేమిని తగ్గించడం లో నా పాత్ర ఎంతో వుంది. 

ఒక్క భారత దేసంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నాకెంతో ఆదరణ వుంది. 2002 లోనే సుమారు 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడ్డాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారపరంగా రవాణా చేయబడ్డాయి. ఈక్వడార్, కోష్టరికా, కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.నాలో (అరటిలో) పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.  నాకు సామాన్యుల పలహారం గా మంచి పేరుంది. కాని  ఇటీవలి కాలం లో ఎంతో దురదృష్టకరమైన పరిణామాలు సంభవించాయి. కొన్ని విదేశీ కంపెనీలు మన దేశంలోకి చొచ్చుకొని వచ్చి నా తోటల పెంపకంలో అడుగుపెట్తాయి. అదేమిటీ.. ఎసి గదుల పెంపకం అట !!! ఇంకొక కంపెనీయో రైతుల భూములను బలవంతంగా లాగుకొని అందులో నా చెట్ల పెంపకం మొదలెట్టి ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచెస్తోంది. ఒకప్పుడు రైతన్నల సాగుబడిలో వున్న నా తొటలను ఇప్పుడు విదేశీ కంపెనీలు, స్వదేశీ దళారులు ఆక్రమించేసుకొని నాతో అడ్డ దిడ్డమైన వ్యాపారం చెస్తూ లక్షలకు లక్షలను గుంజేస్తున్నారు.నా ధరను అందరూ ఇష్టానుసారంగా పెంచేసారు.ఒకప్పుడు డజను పదిహేను రూపాయలు , మరి ఇప్పుడో ??డజను నలభై రూపాయలుగా ఈ దళారులు నిర్ణయించడం వలన సామాన్యులకు అసాధారణంగా అందుబాటులోకి లేకుండా పోయాను. కొన్ని చోట్ల నా గెలలను పొగలేసి మగ్గించెయడం వలన నాలో పౌష్టిక విలువలు నశించిపోతున్నాయి. నా మొరను దయచెసి ఆలకించండి. నా వెతలను తగ్గించి మళ్ళీ నన్ను సామాన్యులకు దగ్గర చెయ్యండి ప్లీజ్ !!!  
కామెంట్‌లు