సీ.స.
నిత్యాగ్నిహోత్రివై నిహిత లక్ష్యార్ధివై
బీడీల సమిధలే వేల్చుచుంటె
దీపధూపములతో దేదీప్యమానంగ
నిత్య కైంకర్యమే నీవు చేస్తె
సిగరెట్టు పొగలోన బిగబట్టి ధ్యానమున్
భస్త్రికా క్రియలతో బాగచేస్తె
పొగచిమ్నిలా మారి పొర్లాడు వలయాల
నెడము లేకుండగ విడిచిపెడితె
ఆ.వె.
గాలితిత్తులన్ని కాలి బూదిగమారి
రక్తమంత ధూమసిక్తమయ్యి
గుండె పగిలి బతుకు కొండెక్కిపోవురా!
పొగను తాగరాదు మగ'వరేణ్య'...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి