506)పురుజిత్ -
ఒక్కడై వీరత్వం చూపెడివాడు
వెనకడుగు వేయలేనట్టివాడు
వీరతనొసగుచున్నట్టి వాడు
ఓటమెరుగని దివ్యతున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
507)పురుషోత్తం -
పురుషులలో ఉత్తమమైనవాడు
మంచిలక్షణములు గలవాడు
విష్ణుమూర్తిగా నున్నట్టివాడు
శివలక్షణసంపన్నుడైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
508) వినయః -
దుష్టులను దండించుచున్నవాడు
వినయమును నేర్పించువాడు
అహమును లొంగదీయువాడు
శాంతముగా నుంచగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
509)జయః -
సర్వులనూ జయించగలవాడు
వశపరుచుకొనగల వాడు
విజయము పొందుచున్నవాడు
పైచేయిగ నిలిచినట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
510)సత్యసంధ-
సత్యసంకల్పం గలిగినవాడు
సత్యవాక్కులు పలికెడివాడు
సత్యసంధతయున్నట్టి వాడు
వాస్తవం ఎరిగించునట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి