శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
531)మహర్షి-కపిలాచార్యః -

వేదవిధుడైనట్టి వాడు 
కపిలాచార్య రూపమున్నవాడు 
యోగశాస్త్రమునిచ్చినవాడు 
సాంఖ్యగ్రంథములకారకుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
532)కృతజ్ఞః -

సృష్టి, కర్త రెండూ తానయినవాడు 
నేర్పరియై యుండునట్టి వాడు 
తనవారిపై గురుతున్నవాడు 
సమూహమును మరువనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
533)మేదినీపతిః -

ధరణికి భర్తగానున్నవాడు 
భూమిని రక్షణచేసినవాడు 
రాజ్యం పరిపాలన చేయువాడు 
విశ్వభారము మోయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
534)త్రిపద-

త్రిపాదాల విశ్వమును నిండువాడు 
వామనుడుగా వచ్చినట్టివాడు 
బలిగర్వమును అణిచినవాడు
అవతారశక్తి చూపించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
535)త్రిదశాధ్యక్షః -

జీవావస్థలకు సాక్షి ఐనవాడు 
జాగృతిని కలిగించుచున్నవాడు 
స్వప్నములనీయగల వాడు 
సుషుప్తిలోన ముంచగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు