ఎదురుచూపు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కన్నీటి కడలిలో
కమ్మని స్వప్నాలా?
మది నిట్టూర్పులో
చిరునవ్వులు పూయాలా?
సుడిగాలి దీపం
శీతలపవనాలజాడ తెలపాలా?
ఎలా సాధ్యం?
యుగాలనాడే ఆమని వెళ్ళిపోయింది
ఆశలవనం ఎప్పుడో
నిప్పంటుకుని మాడిపోయింది
నా మనసిప్పుడు శిలాసదృశమైంది
నా హృదయం గాయాలపాలైనా
కారిన రుధిరంతోనే
ఒక గూడు కట్టుకుంది
అందులో ఇప్పుడు నేను
గొంగళిపురుగును
నేను రూపుమార్చుకుని
సీతాకోకచిలుకగా మారేకాలంకోసం
చిరునవ్వులుచిందిస్తూ
మూగగా ఎదురుచూస్తున్నా!!
**************************************


కామెంట్‌లు