516)అమితవిక్రమః -
అమితవిక్రముడై యున్నవాడు
ఎదిరించువారు లేనివాడు
ధీశక్తి సంపన్నుడైనట్టి వాడు
పరాక్రమవంతునిగానున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
517)అంభోనిధి -
దేవఋణమును తీర్చునట్టివాడు
మనుష్య, పితృ అంభస్సులున్నవాడు
అనంతజలరాశిగా నున్నవాడు
అంభోనిధియై నిలుచువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
518)అనంతాత్మా -
ఆత్మస్వరూపునిగా యున్నవాడు
ప్రాణులన్నిటా ఆత్మగానున్నవాడు
అనంతాత్మకు రూపమైనవాడు
పరిమితిలేక భాసిల్లువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
519)మహోదధిశయః -
వైకుంఠమునందున్నట్టి వాడు
క్షీరసాగరశయనుడైనవాడు
శేషతల్పమునందుయున్నవాడు
విష్ణుమూర్తియై రాజిల్లువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
520)అంతకః -
ప్రళయములోన నున్నట్టివాడు
అన్నిటిని అంతముచేయువాడు
పాపమును నశింపజేయువాడు
అంత్యకాలప్రభువైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి