* పరిమలం....! *
****
సుఖమ్ వెదజల్లే మలినం...
తీవ్ర కాలుష్యమై కంపుకొడు తుంటే...,
శ్రమ చిందిస్తున్న స్వేదం....
సుగంధ భరిత అత్తరై పరిమ ళిస్తోంది..!!
******
@* ఆనందం.....! *
******
సుఖజీవి అనారోగ్యంతో...
దుఃఖ పడుతుంటె....
శ్ర మ జీవి ఆరోగ్యంతో
ఆనందముగా బతుకుతు న్నాడు...!
*******
* హాయి....! *
****
వయసులో సుఖాన్ని మరిగాడు...
ఇప్పుడు కష్టములను భరించ లేక కుమిలి పోతున్నాడు...!
శ్రమించినవాడు సుఖపడుతూఆనందిస్తూహాయిగా ఉన్నాడు...!
*******
* @ చెమట ఫలం.... ।
******
ఆదవులు, మైదానాలు , ఎదారులూ ఆనంద ఆవాస , విహారాలై ఆహ్లాద భరితంగామారి పోయాయి...!
శ్రమ జీవి చిందించిన చెమటగొ ప్ప తనమే..!!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి