దాలిలో పాల కుండ;- ఎడ్ల లక్ష్మి
మల్లయ్య మామా వచ్చాడు
పాలమాకుల కెళ్ళాడు
పాలు కొన్ని తెచ్చాడు
బాలవ్వకు ఇచ్చాడు !!

పాలు కుండలో పోసింది
దాలిలో పిడకలు వేసింది
అందులో నిప్పు వేసింది
దాలిలో కుండ పెట్టింది !!

పాలు కాచి చూసింది
మీగడ తీసి పెట్టింది
అవ్వ చల్లా చిలికింది
వెన్న ముద్ద తీసింది !!

గురిగిలో వేసి కాచింది
ఉడుకుడుకు బువ్వ పెట్టింది
అందులో నెయ్యి  వేసింది 
పచ్చిపులుసు పోసింది !!

పులుసు నెయ్యి కలిపింది
తాతకు కంచం ఇచ్చింది
బొజ్జ నిండా తిన్నాడు
హాయిగా బజ్జున్నాడు !!


కామెంట్‌లు