కుసుమ ధర్మన్న కళాపీఠం
-----------------------------------
ఆకలి ఎప్పుడు వస్తుందో
తెలువదు..
చెప్పక చెయ్యక వస్తుంది..
కబురు లేని చుట్టంవలె..
ఇంటి ఆడ బిడ్డ వలె
అలిగి కూసుంటుంది
కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదని
పలకరింపులు కు మనిషి
లేడు అని.
శపించుకుంటూ కన్నీళ్లు
పెట్టుకుంటుంది నన్ను
ఎవ్వరూ గుర్తుస్తలేరు అని
తన కన్నీటి చుక్క శరీరాన్ని
తకాగానే తెలుస్తుంది
ఆకలి వచ్చింది .
అందుకే కడుపులో
పేగులు అరుస్తున్నాయి
అని తల నొప్పి మొదలైంది
అని .
అప్పుడు గుర్తుకు వస్తుంది
ఆకలికి మర్యాద చేయాలి
అని అమ్మ గుర్తిస్తుండె అందరికంటే ముందుగా .
మర్యాదలు చేస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి