శ్రీరాముని మణిపూసలు;-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రామ రామ శ్రీరామా
రఘుకుల సోమా రామా
దయ గుణము కలవాడ
మము కాపాడవ రామా !!

అయోధ్య రామ రావా
మమ్ము  బ్రోవగలేవా
నీ ముందుకు వచ్చాము
కళ్ళను  తెరవలేవా !!

దివ్య దృష్టి తోడనీవు
అందరినీ చూస్తావు
మేము కానగలేము
జగమునంతా చూస్తావు !!

జగదభి రామ శ్రీరామ
జానకి పతివి రఘురామ
జాగు చేయక రావయ్య
జాలి చూపుల రఘురామ !!

భక్తులంత చూస్తున్నారు
నిన్నే పిలుస్తున్నారు
దీవించగా రావయ్య
భక్తిగ కొలుస్తున్నారు !!


కామెంట్‌లు