వింతలు.. విశేషాలు! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ
 మనం కథల్లో సముద్రపు దొంగలని గూర్చి వింటాం చదువుతాం.ఇంగ్లీష్ లో వారిని పైరేట్స్ అంటారు.సముద్రంలో విహరిస్తూ ఓడలని సరుకులని దోచేస్తూ ఉంటారు.ఈమధ్యనే మనవారు వీరి బారినుండి కాపాడారు అని విన్నాం చదివాం కదా? వారికో ముఠా నాయకుడు ఉంటాడు.అతన్ని కెప్టెన్ అని అంటారు.అలాంటివాడే కిడ్డ్.ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా లో తన సంపదను దాచానని ఆద్వీపంలో సంపదను పంచుతానని తన తోటి వారికి చెప్పి బుట్టలో వేసేవాడు.పట్టుబడి ఇంగ్లాండ్ లోని జైల్లో మగ్గాడు.1701మే నెలలో ఉరితీయబడ్డాడు.జైలు అధికారులకి ఆశ పెట్టాడు తనని విడుదల చేస్తే ఆ సంపద ఉన్న చోటు చూపుతానని.మరి ఇంతవరకూ
ఆ సంపద నిజంగా ఉందో లేదో ఎవరికి తెలీదు.
కామెంట్‌లు