అర్హత!!'-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
పొందినవానికి అన్ని అర్హతలు ఉండాలి
అర్హతలు ఉన్న పొందలేని వాడు రాముడు
దేనికైతే నీవు అర్హుడవో అదే నిన్ను వెతుక్కుంటూ
 వస్తుందో దాన్ని దొరలాగానే స్వీకరించాలీ.!!? పొందిన దాన్ని నిలబెట్టుకోవాలి!!!?

పొందిన తర్వాత అర్హతలు ఉండడం,-
అర్హతల తర్వాత పొందడం ఒకటి కాదు!!?
ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టడం 
దాహం వేసిన వానికి దాహం తీర్చడం
పేదరికంలో ఉన్న వానికి సహాయం చేయడం
ముసలి వారిని ఆదుకోవడం
ఆపదలో ఉన్న వారిని కాపాడడం
అర్హతలు ఉన్నా లేకున్నా వీరికి పొందే అర్హత ఉంది.!!!

ఈ లోకంలో ఒక్కో అర్హత కోసం ఒక్కో దేవుడు పుట్టాడు.!!! కానీ 
మనిషి మాత్రం ఎలాంటి అర్హత లేకుండానే పుట్టి
అన్ని అర్హతలు సంపాదించిడు!!!!???

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
కామెంట్‌లు