521)అజః -
పుట్టుకయే లేకుండినట్టివాడు
ఆదినుండియు ఉన్నట్టివాడు
గెలువబడనట్టివాడైయున్నాడు
త్రిమూర్తులు తనలోనున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
522)మహార్హ -
విశేషపూజకు అర్హుడైనవాడు
అర్చితుడగుటకు తగినవాడు
అనురూప్యత గలిగినవాడు
యోగ్యతలు కలిగినట్టి వాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
523)స్వాభావ్య-
నిరంతరస్వరూపి యైనట్టివాడు
జ్ఞానముతో విరాజిల్లుచున్నవాడు
స్వాభావికము అయినట్టివాడు
స్వీయజ్ఞానము గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
524)జితమిత్రః -
శత్రువులని జయించువాడు
విజయము స్థిరము చేయువాడు
గెలుపుకు అనుకూలమైనవాడు
యుద్ధమందు జయించుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
525)ప్రమోదన -
నిత్యానందములో నున్నట్టి వాడు
ప్రమోదకారకునిగా నున్నవాడు
సంతోషమును కలిగినవాడు
హృష్టుడైనట్టిరీతిలో నున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి