566)గతి సత్తమః -
సర్వులకు గతియైనట్టివాడు
సద్గురువుగా దారిచూపువాడు
సరియైన మార్గమొసగువాడు
సద్గతిని కలిగించగలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
567)సుధన్వాః -
శార్గమును ధరించియున్నవాడు
సుధన్వుడైయున్నట్టి వాడు
శారంగాన్ని పట్టుకొనినవాడు
ధనుర్ధారి అయినట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
568)ఖండ పరశుః -
రిపులను ఖండించునట్టివాడు
పరశువును ధరించినవాడు
క్షత్రియ సంహారం చేసినవాడు
పరశురామావాతారమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
569)దారుణః -
దుష్టులకు భయముకల్గించువాడు
భీకరముగా కనిపించువాడు
దారుణమైన ఆకృతినున్నవాడు
భయంకరమగు రూపమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
570)ద్రవిణప్రదః -
భక్తులకు సంపదలిచ్చువాడు
బంగారము ఒసగునట్టివాడు
బలమును ప్రసాదించువాడు
ధనమునీయగలిగినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి