మన తెలుగుకోసం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గుప్పెడు
అక్షరాలను
గుమిగూడుస్తా

కాసిని
పదాలను
ఎన్నుకుంటా

కొన్ని
ఆలోచనలను
పారిస్తా

కూసిని
భావాలను
పుట్టిస్తా

కొంత
సమయం
తీసుకుంటా

కొంచం
తేనెను
పులుముతా

కొంచెం
గంధాన్ని
చల్లుతా

కాస్త
వెలుగును
ప్రసరిస్తా

కొలది
కవితలను
కూరుస్తా

కొద్ది
పాటలను
పాడుతా

కొందరి
మనసులను
దోచుకుంటా

కొల్ది
క్షణాలు
కేటాయిస్తారా

కాసేపు
కవిని
తలుస్తారా


కామెంట్‌లు