ఏ తోడూ లేని ఒంటరి
అందరికీ జీవమిచ్చే దాత.
ఏ అలుపూ ఎరుగని గమనం
కాలచక్రపు పరిభ్రమణం
గతాలు మారినా శకాలు సాగినా
అదే వేగం అదే నిబధ్ధత
ఎవరి తప్పులూ ఎంచని
ఎవరి పక్షమూ వహించని
ఎవరికోసమూ ఎదురుచూడని
ఎవరో రావాలని ఆగని
ఎవరొచ్చినా ఏమి జరిగినా
కర్తవ్యం మరువని కర్మసాక్షి
కోటి ఆశలు వేయి కలలూ
కొత్త కోరికలూ కొత్త దారులూ
అసంతృప్తులూ...అపజయాలు
అవరోధాలు అన్నీ మనవే!
తప్పులన్నీ మనలోనే ఉన్నా
కలిసిరాలేదని కాలాన్ని నిందించినా
అధర్మాన్నే అలవాటు చేసుకుని
స్వార్థమే పరమావధిగా నడిచినా
చూడకనే దర్శనం ఇస్తూ
వేడకనే ఇచ్చే వరాలిస్తూ
వీడక వెంట వుండి నీడగా
నడిపే సాయం చేసే దైవంలా
వెలుగుల గొడుగుపట్టే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి