గ కాలం!!!;- Dr. ప్రతాప్ కౌటిళ్యా
ఆకు తొడిగిన కాలం మెల్లిమెల్లిగా చిగురిస్తుంది.
ఒకసారి తీగలపాకి ఇల్లంతా చుట్టుకుంది.
మరోసారి మొలకల మొలచి మట్టిని తొలిచి కళ్ళు విప్పి చూస్తుంది.
చెట్టులా ఎదిగి పచ్చని ఆకులతో ఇంటి చుట్టూ అల్లుకుంది.
దూరాన అడుగు మీద అడుగు వేస్తూ అడవిలా భూమంతా పచ్చగా విస్తరించింది.

కాలానికి ఇంత శక్తి ఉంటే కాలిపోయిన మట్టికి ఎంత శక్తి ఉంటుందో కావాలి కాసే చంద్రునికి ఏమీ అర్థం అవుతుంది. చల్లని కళ్ళతో ఇళ్ళ మీద పడి మెల్లిమెల్లిగా గవాక్షంలోంచీ
గాలిని ఒంపినట్లు వెన్న ముద్దలను దగ్ధం చేస్తున్నాడు.

ఇల్లు అలుకగానే పండుగ కానట్లు మెట్ల పైన దివ్యేలను దించుతున్న
భూమి ఉట్టిలోని నక్షత్రాలను ఉడకబెట్టి వదిలింది.
గడగడ వనికిన కాలం ఒకసారి జాలువారుతున్న చెలిమై ఊరి ఊరి ఊరంతా పారింది నీరై
చుట్టూ చేరిన చినుకులు రాలి రాలి నదిలా మారింది.
వాగులు వంపులు తిరిగి చెరువులు గట్లు తెగి కారుతున్న నిండుకుండలా కాలం నీరులా మారింది.

ఎవరు మీరు అంటే నీటికే అంత శక్తి ఉంటే నీటిని దాచిన కుండకెంత శక్తి ఉంటుందో తెలుసుకోలేని సూర్యుడు
సముద్రంలో దాగాలనుకున్నాడు.
దాగుడుమూతలు ఆడుతున్న కాలం ఈసారి గాలిగా మారి
గమ్యం లేకుండా చేసినాడు. తోడుగా భూమి తప్ప నీడ ఇవ్వని నీకు
ఉచ్వాస నిశ్వాసాల్లో విశ్వరూపం చూపిస్తున్నాడు.!!!!?

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు