తిరుపతి శాఖ శ్రీ శ్రీ వేదికలో ఘనoగా శ్రీ శ్రీ జయంతి వేడుకలు

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటలోని శ్రీ సాయిరాo హైస్కూల్ నందు అంతర్జాతీయ చైర్మెన్   శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారథ్యంలో గుత్తా హరిసర్వోత్తమనాయుడు మరియు అరవ జయపాల్ గారి పర్యవేక్షణలో శ్రీ శ్రీ జయంతి వేడుకలను శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాసి ఉషారాణి ఘనoగా నిర్వహించారు. శ్రీ శ్రీ పటానికి పూలమాలవేసి ఘనoగా పిల్లలు సమక్షంలో వేడుకలు నిర్వహించారు. శ్రీ శ్రీ గారి సాహితి ప్రస్తానము రాబోయే తరాలకు స్ఫూర్తి నిస్తుందని అలాంటి దారిలో పిల్లలు నడవాలని పిలుపు నిచ్చారు.ప్రముఖ కవి ఎస్ ఐ బాషా గారిని శాలువా మెమెంటో తో సత్కరించడము జరిగింది.కరస్పాండెంట్ మోహన్ గారు ఉపాధ్యాయులు విజయ మరియు మునిరాజ్  పిల్లలు  శ్రీ శ్రీ జయంతి వేడుకల్లో పాల్గొనడం జఠిగింది. పోగ్రామ్ నిర్వహణ పట్ల హేమమాలిని డాక్టర్ రోజా రమణి  అంజయ్య మహేశ్వరి రజని సుబ్రహ్మణ్యం రoడ్రాసి రుద్ర గుణశేఖర్ నటరాజన్  అభినందనలు తెలియజేసారు.
కామెంట్‌లు