పిల్లలకు చదువు చెప్పడానికి తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇతిహాసాలను ఆ చిన్న పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో కథారూపంలో తల్లి చెబుతూ ఉంటే అతను ఎంత ఆనందంగా ఉంటాడో తెలుసునా ఆ ఇతిహాసంలో ఉన్న సూక్ష్మ రహస్యాలను తల్లి వివరించాలి అది ఏం చెప్తుంది గతించిన కాలం చాలా మంచిది అని ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాల గురించి చెప్పేటప్పుడు రాబోయే రోజులు మంచివి అని చెప్తుంది మరి ఈ రెండు భేదాలు ఎందుకు వచ్చాయో తల్లి వివరించాలి మనసు బుద్ధి మంచిదైతే మంచి ఆలోచనతో చేసిన ప్రతి పని కూడా మంచి దానిలా ఉంటుంది అలాగే ప్రతిరోజు మనకు అది మంచిగా కనిపిస్తుంది అని చెప్పే దానిని అమ్మ బిడ్డకు అర్థమయ్యేలా వివరించాలి. మనలో కొంతమంది పిల్లలు చాలా సున్నితంగా పెరిగే వారు కొంతమంది ఉంటే మరియు కొంతమంది ఎలా పడితే అలా జీవించడానికి అలవాటు పడతారు అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఈ సున్నిత మనస్కులు వేడి అన్నం వేడి కూర ఉంటే తప్ప తినరు రెండో రకం పిల్లలు ఏదైనా తినడానికి సిద్ధం అది అమ్మ పెట్టిన అన్నం అయితే చాలు రాత్రి అమ్మ వంట చేస్తుంది అందరూ భోజనాలు అయిన తర్వాత కొంత అన్నం మిగిలి ఉంటుంది అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంతో పోలుస్తారు కదా దానిని పారవేయవచ్చునా కనుక అది తినడానికి పనికి వచ్చే పదార్థమే కనక దానిని ఎలా తినిపించాలో అమ్మకు తెలుస్తుంది మనం దానిని చద్ది అన్నం అంటాం అంటే అన్నం పులవడం అన్నమాట. ఒక రాత్రి అన్నం నిలవ ఉంటే ఆ పులిసిన అన్నం తినడం వల్ల శరీరానికి ఎన్ని రకాల పోషకాల శక్తిని ఇస్తాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది శాస్త్రీయమైన దృక్పథాన్ని కూడా పిల్లలకు చెప్పాలి దానితో ఆ చద్ది అన్నం పైన ప్రేమ పెరుగుతుంది 50 గ్రాముల అన్నాన్ని తీసుకొని రాత్రి పులియపెట్టినట్లయితే ఒకటి పాయింట్ 6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీగ్రాములుగా పెరుగుతుంది అలాగే పొటాషియం కాల్షియములు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి ఇది ఆకర్షణ కోసం చెప్పే విషయం కాదు శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేసి చెబుతున్న విషయం రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటి వివరిస్తాను.
కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి