కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 జీవితంలో మనిషి క్రమశిక్షణగా జీవితాన్ని నడిపినట్లయితే  శరీరానికి ఎలాంటి రుగ్మతలు రావు  మనం ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంతో పాటు ఒక చెంచా తేనె తాగినట్లయితే  అది రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది  మసాలాలు పుల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వ్యక్తులకు  అల్సర్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది  ఇలాంటివారు క్యాబేజీ రసాన్ని తాగితే  అల్సర్ త్వరగా తగ్గిపోతుంది  సమయపాలన తప్పక ప్రతి ఒక్కరూ పాటించాలి  దానితో శరీరం మీ అధ్యయనంలో ఉంటుంది  ధూమపానాలు మద్యపానాలు  చేయడం వల్ల ఏదో సుఖం  అనుభవిస్తాం అన్న బ్రాంతిలో బ్రతకకుండా  వాటికి దూరంగా ఉండాలి  దానితోపాటు బాదంపప్పు చాపలు తింటే అల్సర్ మన దరిదాపుల్లోకి రావు సమాజంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి సమాజంతో కలిసి మెలిసి ఉండడం నేర్చుకోవాలి  ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అన్న విషయం ముఖ్యం  బంధాలను కలిపేది ఆ బంధాలను తెంచేది మనం మాట్లాడే మాట పై ఆధారపడి ఉంటుంది  ఎదుటివారి మనసులను గాయపరిచేది  వేరే వారి గాయాలను     తగ్గించేది మిత్రుల మాటే  ప్రాణం తీసేది ప్రాణాల్ని  మోషేది కూడా మాటే  మాటే మనల్ని గెలిపిస్తుంది అదే మాట మనల్ని ఓడిస్తుంది  ఏ నోటితో అయితే మనం ఒకరి మీద నిందలు వేస్తామో  ఆ నోటితో మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకోవద్దు  అందుకే మాట్లాడే ముందు మంచిగా ఆలోచించి మాట్లాడాలి  మౌనమే  శరణ్యం  మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు అని పెద్దలు చెప్పిన నానుడి  ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో  మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా క్రమం తప్పకుండా నీరు తాగాలి  రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరైనా తాగితే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది  తప్పనిసరిగా ఎండలో పని చేస్తున్నవారు గంటకు 10 నిమిషాలు చొప్పున నీడలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటే  కొంత ఉపశమనం కలుగుతుంది  ఇవాళ మోజులో  శరీరానికి అంటిపెట్టుకున్న బట్టలు వేసుకోవడం అలవాటు కానీ ఈ వేసవిలో మాత్రం  గాలి బాగా ఆడే దుస్తులు ధరించడం నేడు  ఏ పరిస్థితుల్లోనూ కూల్డ్రింక్స్ తాగవద్దు  ఏదైనా డ్రింకు తాగాలని అనిపించినప్పుడు కొబ్బరి నీరు తీసుకోండి ఇంటిలో చక్కటి మజ్జిగ ఉంటాయి  నిమ్మరసం అన్నిటికన్నా  శ్రేష్టం  శరీరంలో నీటి శాతం పెంచే పుచ్చకాయ కీరదోస తినడం  ఎంతో మంచిది.


కామెంట్‌లు