కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు 6302811961.
 ఆదిశంకరాచార్యుల వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని తెలియజేశారు  అది ఎంతమందికి అర్థం అవుతుంది  భగవంతుడు లేడు  వారిని పూజించే భక్తుడు లేడు ఉన్నది ఒకటే  ఏకం సత్ అని చెప్తున్నాడు  కానీ మనకు  రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు  జీసస్ ఉన్నాడు  అల్లా ఉన్నాడు  సాయిబాబా కూడా ఉన్నాడు  వీరందరూ ఉన్నారు కనుక వాటిని మనం పూజిస్తున్నా  వారు లేరు నీవు లేవు అన్నదానికి అర్థం లేదు అన్న వ్యాఖ్యతో ఆయనను ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము  నేను జీవించే ఉన్నాను నేను లేకపోయినట్లయితే పూజలు పునస్కారాలు ఎలా జరుగుతాయి అని తర్కించే వారికి  సమాధానం అంతా త్వరగా   చిక్కదు  విషయం అంత త్వరగా జీర్ణం కాదు.
బ్రహ్మ సత్యం జగత్ మిద్య బ్రహ్మ శాశ్వతం జగత్తు అశాశ్వతం  అని కూడా పెద్దలు చెప్పారు  బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది లేకపోయినట్లయితే ఈ జగత్తు లేదు  అన్ని ప్రపంచాలు కలిసిన దానిని జగత్ అంటున్నాం  ఈ బ్రహ్మ పదార్థాన్ని ఆంగ్లంలో ఆటం అని అంటారు  అణువు ఏదైతే ఉన్నదో  దానిని విస్పోటనం చేయడం మనవల్ల కాదు  అది మూల పదార్ధం  జ అంటే  పుట్టుక  గతి అంటే మరణించుట  జగతి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు  ఉన్న చక్రం  ఉదయం లేస్తాం అంటే పుట్టాం  రాత్రికి నిద్రిస్తాం మరణించాం  ఈ పుట్టినరోజు మరణించేంత వరకు మనం చేస్తున్న నిత్య కృత్యాన్ని నిర్దేశించింది శంకరాచార్య  మనం చేసే ప్రతి కార్యం శంకరాచార్యుల వారు చెప్పినదే. మనం సరదాగా ఏదైనా సినిమాకు వెళ్ళినప్పుడు  తెర పైన బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. వాటి పాత్ర అవి నిర్వహిస్తాయి  కానీ దానిని చూస్తున్న మనకు  నవరసాలు అనుభూతికి వస్తాయి  ఏదైనా కష్టం వచ్చినప్పుడు  మనకు కన్నీరు వస్తుంది  అది తెరపై చూస్తున్న బొమ్మ కదా అని మాత్రం ఆ క్షణాన ఆలోచించం ఏదైనా ఒక హాస్య పాత్ర  చక్కటి హాస్యాన్ని వినిపించినప్పుడు పకపకా నవ్వుతూ ఉంటాం ప్రక్కవాడు ఏమనుకున్నా సరే  అది పాత్రలు చేస్తున్న  సినిమా అన్న  ఆలోచన ఆచడానికి రాదు  ప్రతి క్రియకు ప్రతిక్రియ ఉంటుంది అన్నది సత్యం  అక్కడ పాత్ర నవ్వుతున్నప్పుడు నవ్వడం బాధ పడినప్పుడు దుఃఖించడం ప్రేక్షకులు కూడా అనుభూతిని పొందడం అనేది సహజం  నిజజీవితం కూడా అంతే అనేది శంకరాచార్యవాదం.

కామెంట్‌లు