:బిచ్చగాడు (కథ );- కనుమ ఎల్లారెడ్డి,-ఆస్టిన్, టెక్సస్ స్టేట్-అమెరికా93915 23027.
 విజయ, సుమతి మంచి స్నేహితురాళ్లు విజయ కు మంచితనం, పేదలు అంటే అభిమానం ఎక్కువ. సుమతి దీనికి వ్యతేరేకం బిచ్చగాళ్ళను ఎప్పుడు ప్రోత్స హించకూడదు. వారికి కావలిసిన ఆహారం ఇస్తే సరిపోతుంది అనేది. ఇద్దరికీ దీని మీదే చిన్న పాటి ఘర్షణ జరిగేది. అది వాళ్ళ ఆఫీస్ లో ఉన్న బాస్ కు తెలిసింది. ఒక రోజు విధులు ముగించుకుని ఇద్దరూ ఒకే కారు లో పయనిస్తున్నారు. దారిలో ఓ బిచ్చగాడు "ధర్మం బాబు, ఆకలిగా ఉంది "అని కేకలు వేస్తున్నాడు. వెంటనే విజయ, సుమతి కారు దిగారు. సుమతి రెండు దోసెలు పార్సలు తీసుకు వచ్చింది, విజయ  ఐదు వందల రూపాయలు ఇవ్వబోయింది. "డబ్బు నాకెందుకమ్మా, కుంటి వాడిని వెళ్ళి తెచ్చుకోలేను. రోజు ఈ సహాయం చేస్తే చాలు "అన్నాడు. సుమతి కల్పించుకుని "నీ టైం చెబితే నేనే స్వయంగా వచ్చి నీకు ఆహారం అందిస్తాను "అంది. దానికి బిచ్చగాడు తన వేషం తీసి నిలబడ్డాడు. అది చూసి ఇద్దరూ కంగు తిన్నారు. అతను ఏవరో కాదు వాళ్ళ  బాస్. "మీ ఇద్దరి ఆదర్శం మంచిదే అయినా, నిజంగా బిచ్చగాళ్ళకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వకూడదు. సుమతి చేసిన పని నాకు నచ్చింది "అని మెచ్చుకున్నాడు. దానితో విజయ కూడా మారి బిచ్చగాళ్ళకు ఆహారం ఇవ్వడానికి నిర్ణయించుకుంది.
.....
                          (సమాప్తం )కామెంట్‌లు