ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ బి ఆనంద్,విజయవాడ కేంద్రం,9492811322

 రేడియో వాల్మీకి వ్యాసుడిగా ప్రఖ్యాతి పొందిన ఉషశ్రీ గారి శిష్యుడు జంధ్యాల నండూరినే దృష్టిలో పెట్టుకునే కాకుండా మా శిష్యుడు ఆనంద్ నికూడా దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాయి అనేవాడు గురువుగారు. 15-30 నిమిషాల నాటకాలు చదవడం రాశాడు గంట నాటకాల జోలికి వెళ్లలేదు నా ప్లాస్టిక్ పూలు సుమన్ వ్రాసిన ధారావాహికలో కథానాయకుడు పాత్ర ఇచ్చి నేను పెడతాను, తీస్తున్న నేను కథానాయకుడు అయినా పేరు మీకే వస్తుంది అనేవాడు  తాను సినీ రంగానికి వచ్చి రచన దశ కొత్త శాఖలో పనిచేసిన ప్రతి సినిమా కథ ముందుగా ఆకాశవాణిలో ప్రసారానికి తాను రాసుకున్నవే. ఒకసారి ప్రఖ్యాత నిర్మాత నవతా కృష్ణంరాజు గారిని రేడియోకు తీసుకువచ్చి నన్ను సుబ్బారావు గారిని రామ్మోహన్ గారిని పరిచయం చేసి వీరి వల్లే దర్శకత్వంలో పట్టు నేర్చుకున్నాను అని చెప్పి మాకు పాదా నమస్కారాలు చేసి అప్పుడే కొత్తగా సినీ రంగానికి వచ్చిన కవితతో కవితా వారి పాదాలకు నువ్వు కూడా నమస్కరించు కొన్ని అక్షరాలు అయినా వంట పడతాయి అన్నాడు.
వెంటనే నవ్వుతూ మా ముగ్గురు కూడా నమస్కారాలు చేసింది కవిత  తర్వాత చాలా సార్లు సినిమాలలో ఒక వేషం ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ నాకు ఇష్టం లేకపోతే లేదు నా ఫోటోగ్రాఫర్ శనగల గోపాల్ రెడ్డి మీ తేలప్రోలు గ్రామ వాసి మీరే మీ మొహమాట పడకుండా వచ్చేయండి అనేవాడు కానీ నేను వెళ్ళలేదు  నేను గురువుగారు ఉషశ్రీ గారు మల్లిక్ గారు కలిసి ధర్మ సందేహాల రికార్డింగ్కు మద్రాస్ వచ్చామని తెలిసి మమ్మల్ని వారి ఇంటికి భోజనానికి పిలిచి గౌరవించాడు కూడా  తన సినిమా శత దినోత్సవ వేడుకలకు సతీసమేతంగా వచ్చిన గిరీష్ కర్నాడ్ గారిని నాకు పరిచయం చేస్తే  హి ఈజ్ నాట్ ఆనంద్ హి ఇస్ మై హయగ్రీవ అన్నారు.వారు నిర్వహించి ప్రధాన పాత్ర పోషించిన  అయ్యా హయవదనే నాటకాన్ని తెలుగులో నేను చేశాను నాకన్నా మీరు చాలా బాగా చేశారని ఆయన నన్ను పొగడం  ఆయన సంస్కారం.
గిరీష్ కర్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి  రచయితగా నటునిగా దర్శకునిగా  తాను నిర్వహించిన నాటకాలను లండన్ లో కూడా ప్రదర్శించి  వారితో కూడా ప్రశంసలను అందిన  మంచి వ్యక్తి  వారు నటించిన  వివిధ రకాల పాత్రలను మరెవరు పోషించి  ఉండరు  వారి పక్కనే ఉన్న వారి శ్రీమతి కలగజేసుకొని ఆనంద్ జీ మేము ఎప్పుడు నాటకాలు గురించి మాట్లాడుకున్న  తనకన్నా మీరే చాలా బాగా చేశారని ఎంత పొగిడేవారో చెప్పలేం అనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది  ఆమెకు పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నాను  జంధ్యాలను  తన సినిమా విడుదల సందర్భంగా ఆకాశవాణి సన్మానం ఏర్పాటు చేశారు ఉషశ్రీ గారు  సభా నిర్వహణ కూడా ఆయనే ఆ సభలో సినీనటి జమున పాల్గొనడం విశేషం  కోనేరు రవీంద్రనాథ్ నా సహాధ్యాయి ఎస్ఆర్ఆర్ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పోస్ట్ ఆఫీస్ నాటకంలోనూ బలిదానం చారిత్రక నాటకంలో నాతో కలిసి పని చేశారు.
కామెంట్‌లు