మన తిరుపతి వెంకన్న;- ఏ బి ఆనంద్,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉత్తరపు వీధిలోని  హిందుస్థాన్ రామాంజీ కూటం వేరే చోటికి తరలి వెళ్ళిపోయింది దీనిని మూలమట్టం అనేవారు వ్యాసరాయ మఠం ఇప్పుడు లేదు అర్చకుల ఇల్లు ప్రస్తుతం ఉన్నాయి రాతి తేరు ఉత్తర మాడవీధి తూర్పు మాడవీధి రెండు కలిసిన ఈశాన్య మూల ఈ రాతి తేరు ఉండేది దాని చక్రాలు ఇప్పటికీ భూమిలో పూడిపోయి ఉన్నాయి పై భాగం తొలగించి టిబి దగ్గర శ్రీవారి మెట్టు దారి తిరుమల లో కలిసే చోట ప్రతిష్టించారు శ్రీకృష్ణదేవరాయుడు అతని తమ్ముళ్లు అచ్యుత దేవరాయలకు ఆంతరంగిక భద్రతాధికారిగా పనిచేసిన ఎల్లప్ప నాయకర్ క్రీస్తు శకం 5016లో ఈ రాతి తేరుని నిర్మింప చేశాడు అని చెప్తారు  తూర్పు మాడవీధి ఈ వీధిలో రథం ఉంది దాని మీదికి ఎక్కడానికి ప్రక్కనే ఒక దివ్వె ఉంది. వాహన మండపం ఉంది ఇతరమైనవి ఏమీ లేవు అన్నీ తొలగించారు. ఉత్తరపు వీధి హిందుస్థాన్ రామాంజి కూటములు ఉన్నాయి ఉత్తర హిందుస్థాన్ నుంచి వచ్చిన వైష్ణవులకు భోజనం ఒక్కడే పెడతారు హిందుస్తానీ షావుకారులు ఈ రామాంజి    కోటాలకు సరిపడిన ధన సహాయం చేస్తారు  వ్యాసరాయ స్వాముల వారి మఠం ఇది  పూర్తిగా శిథిలం అయిపోయింది నివాసయోగ్యం కాదు ప్రస్తుతం అర్చకుల ఇండ్లు  ఈ వీధిలో అర్చకులు నివసిస్తూ ఉంటారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తప్ప ఇతర కాలాలలో అర్చకులు ఇళ్లు చాలా భాగం ఖాళీగా ఉంటాయి  పూజ చేసే వంతు గల అర్చక గుమస్తాలు మాత్రమే ఎప్పుడూ అక్కడ ఉంటారు  రాతి తేరు  ఈశాన్యంలో ఈ రాతితేరు ఉన్నది. శిలాస్యములు చక్రములు భూమిలో పూడి ఉన్నాయి  ఆ రథానికి గోపురం లాగా ఉండే పై భాగం పడిపోవడం వల్ల ఇప్పుడు మండపం పైకి  తెలుస్తోంది  ఈ రథం పూర్వం ఎప్పుడో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ప్రస్తుతం ఉపయోగించబడి కొయ్య తేరువలే ఉపయోగించబడుతోంది అని చెప్తారు పెద్దలు తూర్పు మూల వీధి  శ్రీ ఉత్తరాది స్వాముల వారి మఠం ఇది  ఈ వీధిలోనే ఉండి ఉత్తరపు వీధిలో ఉన్న శ్రీ వ్యాసరాయ స్వాముల వారి మఠం వలే  పూర్తిగా శిథిలం కాకుండా పోయింది మరమ్మతులకు తగినట్లుగా ఉంది  శ్రీ పరకాల స్వాముల వారి మఠం ఇది కొత్తగా కట్టారు ఉత్తర వీధిలో పడిపోయిన పాత మఠానికి సంబంధించిన స్థలం ఉంది  రోజు కొద్ది మంది వైష్ణవులకు భోజనం పెడుతూ ఉంటారు  ఇక్కడ కూడా తదియ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇది వడవల మఠం దేవస్థానం నుండి ప్రతిరోజూ బియ్యం వగైరా సామానులు ఇస్తూ ఉంటారు.
కామెంట్‌లు