త్రిగుణాత్మకం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 జీవితంలో విజ్ఞులైన వారు చేస్తున్న పని  ఐదు అక్షరాలతో కూడిన  నమశ్శివాయ  అన్న పంచాక్షరి అని చెప్పించేవారు కొంతమంది ఉన్నారు  ఈ జీవిని బ్రహ్మ సృష్టిస్తాడు  విష్ణువు పెద్ద చేస్తాడు శివుడు  ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఇస్తాడు  అని భారతీయుడు నమ్ముతూ ఉంటారు  మళ్లీ దీనిలో రెండు శాఖలు ఒక వర్గం  శివుని ఆరాధిస్తూ ఉంటారు  బ్రాహ్మణ విష్ణువును పూజించిన తరువాత నైనా చివరికి నమ్ముకోవలసినది శివుడినే అన్న నమ్మకం వారికి  మరొక వర్గం వారు  నారాయణుని  అంటే విష్ణుమూర్తి నమ్ముకొని వారి కోసమే  పూజలు పునస్కారములు చేసుకుంటూ  మనసంతా వారిపైనే ఉంచుకుంటారు.  నారాయణ మంత్రాన్ని అనుక్షణం ఉచ్చరిస్తూనే ఉంటారు.
మన పెద్దలు మనకు చెప్పే సూక్తి మానో వాక్కాయ కర్మలు  త్రిగుణాత్మకమైన ఏ పద్ధతిని సిద్ధాంతాన్ని నీవు నమ్ముకుని ఉంటావో  దానిని గురించి ఆలోచించు దానిని గురించి మాట్లాడు దానినే చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా నిలచి ఉండు  అంటారు  కానీ మీరు ఏ ఇంట్లోకి వెళ్లి చూసినా  ఎవరి ఇంట్లోనూ ఒకే దేవుని చిత్రపటం ఉండడాన్ని చూడలేం  వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుని పూజిస్తున్న వారు  వేరే సాయిబాబా   ఛాయాచిత్రాలను కూడా పెట్టి వాటిని కూడా పూజించడం మనం చూస్తూనే ఉంటాం  అంటే మనసులో వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నావా సాయిబాబాని నమ్ముతున్నావా అని ప్రశ్న వేస్తే  దానికి సమాధానం  శూన్యం అనే వస్తుంది. పుణ్య చరిత్రలకు ఆలవాలమైన పెద్దల జీవితాలను తెలుసుకోవడం  వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వాటిని  విశ్వసించి అనుసరించడం  చేసేవారిని ఎంతగానో  స్రాగించవచ్చు  అయితే మానవ ధర్మాలు కొన్ని ఉన్నాయి  ఎదుటివారిని కూడా చూస్తూనే వారు మూలలో పడినప్పుడు  సహకరించి సాయం చేయవలసిన గుణాన్ని అలవర్చుకోవాలి  అవసరంలో ఉన్న వారికి మీ చేతనైన సహాయం అందించాలి ఆకలికి అలమటిస్తున్న వాడికి  కనీసం  జేబులో నుంచి రూపాయి ఇవ్వటానికి కూడా మనసు రాని వ్యక్తుల  పూజలు ఆలోచనలు అన్నీ నిష్ప్రయోజనం  ఎందుకూ కొరగావు అని చెబుతున్నాడు  వేమన తన పద్యంలో ఎంతో అనుభవంతో  ఎన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా మనకుసలహా ఇస్తున్నాడు  ఆ పద్యాన్ని ఒక సారి చదవండి.

"నమశివాయనవచ్చు నారాయణానవచ్చు మేలు వారి నమ్మి మెచ్చవచ్చు కొంగు కాసు విడిచి గొప్ప నీ లేడు విశ్వదాభిరామ వినురవేమ..."

కామెంట్‌లు