కాశీ యాత్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు  కాశీ నగరాన్ని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. జీవితంలో ఒకసారి అయినా వెళ్లి ఆ కాశీ పట్టణాన్ని చూసి తన జీవితం  ధన్యం చేసుకోవాలి అనుకున్న వారు అనేకమంది ఉంటారు. మానవుడు అనుకున్నవన్నీ చేయగలిగితే అతను దేవుడితో సమానమే కదా  అనుకున్న ప్రతివాడు నేను కాశీకి వెళుతున్నాను వెళుతున్నాను అంటూనే ఉంటాడు  ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటాడు  ఈ పూజ పూర్తయిన తర్వాత వెళ్లి వస్తానని అందరినీ నమ్మిస్తూనే ఉంటాడు  కానీ  విధి అంగీకరించినప్పుడు  అతని చేతిలో ఏదీ ఉండదు  వాస్తవానికి  మనసులో ఆ ఆలోచన మాత్రం స్థిరంగా నిలిచి ఉంటుంది పుణ్యం ఉంటే తప్ప కాశీ పట్టణాన్ని చూడలేరు అని మన పెద్దలు చెపుతూ ఉంటారు అది అక్షర సత్యం. మనం అతి సమీపంలో ఉన్న అనేక పనులను చేయకపోవడం  అంటే ఆ వ్యక్తి బద్ధకస్తుడై ఉండాలి  దానిపైన  శ్రద్ధ లేకుండా అయినా ఉండాలి  ఉదాహరణకు విజయవాడలో ఉన్న  కృష్ణా నదిలో  స్నానం చేసి పవిత్రులు కావాలని  కృష్ణానది ప్రక్కనే ఉన్న దుర్గమ్మ తల్లిని దర్శించుకుని  జీవితంలో తన కోరికలన్నీ అమ్మవారితో చెప్పుకొని  ప్రశాంత చిత్తుడై తిరిగి రావాలనుకునేవారు ఎంతమంది అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు  అతి సమీపంలో ఉన్న వ్యక్తులు కూడా దర్శించుకోలేని స్థితిలో ఉన్నారు అంటే కారణం  సమయం ఏది వ్యక్తి చేతిలో ఉండదు  కాలం ఎలా నడిపిస్తే వ్యక్తి అలా నడుస్తాడు తప్ప  నేనే నా కాలాన్ని నడిపిస్తున్నాను అన్న అహంతో ఉన్న ఏ వ్యక్తి కూడా  అది అసాధ్యము అని తెలుసుకోలేరు. ఒక మంచి పుస్తకం మన చేతిలో  మన సొంత పుస్తకం ఉన్నా దానిని చదవాలన్న కోరిక మనసులో గాఢంగా  ఉన్నా  తరువాత తరువాత అనుకుంటూ చదవటం  కుదరదు అదే గ్రంథాలయం నుంచి తెచ్చుకున్నదైతే  వారం రోజులలో ఇవ్వకపోతే అతను పెనాల్టీ కట్టవలసి వస్తుంది  కనుక తప్పకుండా దానిని వారం లోపే పూర్తి చేసి తిరిగి వారికి ఇచ్చివేస్తాడు  అంటే వ్యక్తి  తన హక్కులను వినియోగించుకుంటున్నాడా  లేక బాధ్యతగా వ్యవహరిస్తున్నాడా అన్నదానికి సమాధానం మనకు దొరకదు  ఆలోచన రీతిలో కూడా ఇలాగే తత్వాలు ఉంటాయి  కాశీకి వెళ్లకుండానే వెళ్లి వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు  వారికి ఇలా చెడు జరుగుతుందా  కనపడే ఏమైనా చెప్పడం కర్మఫలం లేకుండా ఏ పని జరగదు  ఏది మన చేతిలో లేదు అని చెప్తున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.

"కాశిబోదు ననుచు కడకట్టగానే  లా వాసి తీర్థములను ఒక వన్నెల దోసకారి కెట్లు దొరకు రా ఈ కాశి విశ్వదాభిరామ వినురవేమ..."

కామెంట్‌లు