ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 మా గ్రామం మొత్తానికి అక్షరదానము చేసిన వారు మా గురువుగారు పాటిబండ శ్రీమన్నారాయణ గారు  వారు చదివింది మెట్రిక్యులేషన్  ఆయన చెప్పే పాఠాలు షేక్స్పియర్ నుంచి మిల్టన్ వరకు అందరిని ఆపోసన పట్టిన మంచి చదువరి అలాంటివారు అప్పకవి తప్పుల గురించి తీసెస్ ను నామా గురువు గారి అన్న కొడుకు మాధవ శర్మ ఆయన మాధవ వర్మ అనే పేరుతో చక్కటి నాటకం  చక్కటి నవల రాశాడు మంచి రచయిత ఆయన పిహెచ్డి పూర్తయిన తర్వాత మా ఊరుకు శ్రీశ్రీని తీసుకువచ్చినవాడు అలాంటి వాడికి ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చి  వారు చేసిన తీసెస్ కి ఎంతో ఉపయోగకారిగా ఉన్నారు  శర్మ గారు మా గ్రామంలో మొట్టమొదట వార పత్రిక వీణను ప్రారంభించారు  ఆయనకి గుడివాడ రాజగోపాల్ గారు సహాయకులుగా ఉండేవారు
శ్రీరంగం శ్రీనివాసరావు  గారు శర్మ గారి సహాధ్యాయుడు అప్పటికి వారు శ్రీ శ్రీ కాలేదు  శ్రీరంగం శ్రీనివాసరావు గారే ఆయన సబ్ ఎడిటర్ గా ఉన్నారు  అందులో విశ్వనాథ సత్యనారాయణ జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి  అనే జరుక్ రాచకొండ నరసింహ మూర్తి గార్ల రచనలు వస్తూ ఉండేవి ఆ   పత్రికకు  సలహాదారు మా నాన్నగారు  నా విద్యాభ్యాసం అంతా  ముప్పిడి వాళ్ళ అరుగు మీద మా దొడ్లో సావిడిలో జరిగింది  శ్రీమన్నారాయణ గారికి సహాయకుడిగా మా పెద్దన్నయ్య కోటిరెడ్డి  సుబ్బారావు గారు ఉండేవారు మా గురువుగారు నన్ను సుశీలను తన కుర్చీ ప్రక్కనే కూర్చోబెట్టుకుని ఎన్నో పాఠాలు చెప్పేవాడు  ఆ చెప్పేటప్పుడు ఏదైనా తప్పు వస్తే మొట్టికాయలు వడ్డించేవాడు. నాలుగో తరగతి వరకు  నేను ఫస్ట్ అయితే సుశీల సెకండ్ సుశీల ఫస్ట్ అయితే నేను సెకండు వచ్చేవాళ్ళం మా తర్వాతే మిగతా వాళ్లంతా రాత్రులు గురువుగారి ఇంటికి వెళ్లే వాళ్ళం రవీంద్రనాథ్ ఠాగూర్ గురుకులాన్ని చూడలేదు కానీ మా గురువు గారి ఇల్లు అలా ఉండేది మా గురువుగారి భార్య మమ్మల్ని  కన్నబిడ్డలా చూసుకునేది ఎవరైనా భోజనం  చేయకుండా వచ్చారు అంటే వాళ్లకు చక్కటి భోజనం పెట్టేది మా ఊరికి నాలుగు ఐదు రోజులకి ఒకసారి ఒక సినిమా వస్తూ ఉండేది ఆ కొత్త సినిమా వచ్చిన మొదటి రోజున ఒక రెండు రూపాయలు ఇచ్చి మీ శిష్యురాలిని గురువు గారి భార్య తీసుకెళ్ళు అని చెప్పేవారు ఆ సినిమాకి వెళ్లి మధ్యలో ఇంటర్వాల్ లో సోడా తాగే వాళ్ళం తిరిగి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వబోతే ఉంచుకోరా ఏదైనా కొనుక్కో సరదాగా చాక్లెట్లు అనేవారు.
కామెంట్‌లు