ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నాలుగు గోడల మధ్య కూర్చుని చేసే కార్యక్రమాలు కాకుండా ప్రతి శ్రోతకు రేడియో కార్యక్రమాలు ఎలా జరుగుతాయో ఆ పద్ధతిని ప్రజానీకానికి తెలియజేయడానికి నడుం  కట్టింది ఉషశ్రీ శ్రీనివాసన్ సుభద్ర గార్లు. ఉషశ్రీ గారు శ్రీనివాసన్ అన్నగారు ఎప్పుడు రజని గారి గురించి మాట్లాడుతుంటారు ఎవరి సత్తా ఎంతో ఎంచి ఆ కార్యక్రమ నిర్వహణకు వారిని నియమించడం  అంత స్వేచ్ఛనిచ్చి బాధ్యత అనిపించినవాడు రజిని గారు అంటారు   ఉషశ్రీ  ధర్మసందేహాలు కార్యక్రమంలో ఎన్ని అవకాశాలు ఉన్నా బాధ్యతాయుతంగా వ్యవరించడం వల్ల ఆ కార్యక్రమం అంత ప్రాచుర్యం చెందింది. జీవితంలో ఒక క్రమశిక్షణ లేని నాకు రేడియో ద్వారా క్రమశిక్షణ ఇచ్చింది రజనీగారు అంటారు ఉషశ్రీ గారు. ఆ మాట అక్షర సత్యం అని  ఆమోదముద్ర వేస్తాడు శ్రీనివాసన్ గారు అలాంటి పెద్దవాళ్ళని విస్మరించుకొని వారి విషయాలను  మీకు అందించే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది  శతపత్ర సుందరుడు డాక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు 1920 జనవరి 29 జనవరిలో జన్మించారు జంట కవులలో ఒకరైన బాలాంతరపు వెంకట్రావు గారి కుమారుడు  వీరు గొప్ప హాస్య ప్రియుడు అలాంటి మేధావిని నాకు పరిచయం చేసినది ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి హేమలత అనబడే లత గారు  ఆకాశవాణిలో రజనీ గారికి పరిచయం చేస్తూ వీడు నా కొడుకు అన్నది అది ఏమిటి లత అంత పెద్ద బూతు మాటలు  అన్నావు అన్నారు రజినీ గారు తడుముకోకుండా మీరు అనుకున్న అర్థం కాదు నేను మా వంశిని  ప్రసవించడానికి వెళ్ళినప్పుడు నా స్థానంలో వీడిని వేశారు.
కనుకనే వీడు నా పెద్ద కొడుకు అని చెప్పారు లత గారు అదా విషయం అంటూ పకపకా నవ్వారు రజిని గారు జీవితమంతా నవ్వుతూనే బ్రతికారు వారి తల్లి వెంకటరమణమ్మ గారు కూడా సాహితీ సంస్కారం గల వ్యక్తి ఇంటిలోని సాహితీ వాతావరణం  దానికి తగినట్లు తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ ఉండే టేకుమల రాజగోపాల్ రావు తిరిగి జల వెంకటరత్నం చెరుకూరి నారాయణరావు గంటి జోగి సోమయాజులు వంటి పండితులతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది  రజనీ గారు పిఠాపురంలో ఉండి తమ బంధువైన పులగడి లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తి సంగీతం మేనమామ మద్దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రి సంగీతం నేర్చుకున్నారు  కాకినాడ పీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయ సంగీతం మీద కూడా దృష్టి పెట్టారు.
కామెంట్‌లు