మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వసంతోత్సవం ఇది పత్రి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు పూర్ణిమ వరకు మూడు దినములు జరుగుతూ ఉంటుంది మొదటి రెండు రోజులు ఉదయం 8 గంటలకు శ్రీవారికి రెండవ నివేదనలై బంగారు తిరిచి లో పునర్వసు ఉత్సవానికి చెప్పిన మండపానికి విజయం చేసి అక్కడ తిరుమంజనం అలంకారం నివేదన ఆస్థాన వినియోగాలు  ఉత్సవమైన తర్వాత శ్రీవారు కొంత రాత్రి అలసిన పిదప దేవస్థానములోనికి విజయం చేసి నిత్య ఉత్సవ ఆస్థానములైన శ్రీవారి  సన్నిధిలోనికి దయచేసి తోమాల సేవ మొదలుకొని జరిగి తీర్మానం అవుతుంది మూడో రోజు కూడా ఇదే రీతిగా జరుగుతుంది శీతా లక్ష్మణ హనుమ సమేతముగా రాములవారు కూడా విజయం చేశారు ఈ మూడు రోజులు రాత్రి పగలు రెండు పూటలు బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది ఈ ఉత్సవం అధికారి శ్రీరామలక్కన్ దాస్ జీ వారి ధర్మం. విశేష ఉత్సవాలు ఆస్థానాలు వీనిలో ఒక్కొక్క ఉత్సవం సంవత్సరానికి ఒక్కసారి వస్తూ ఉంటుంది ఇందులో ముఖ్యమైన వాటిని మనం చూద్దాం  సంవత్సరాది ఆస్థానం ఇది ప్రతి సంవత్సరం ఆంతర సంవత్సరాది దినమున జరుగుతుంది ఈ రోజున 12 గంటలకు  నివేదన ఉదయం 5 గంటలయిన తర్వాత మలయప్ప స్వామి వారు ఉత్సవాలు శ్రీ తాయారుల సైతము రంగమండపంలో జోడించి ఉన్న బంగారు మండపం అనేటువంటి సర్వభూపాల వాహనం దయచేసి  వజ్ర కవచము రఘోజీ బాన్సులే మొదలగువారు సమర్పణ చేసిన విశేషాలు తీర్వాపరణములు అంటే నగలు సమర్పణ చేయబడిన తర్వాత పుష్పాలంకారమై విశేష నైవేద్యంతో రెండవ గంట అయినా తరువాత శ్రీ మూల వరుణకును ఉత్సవములను నూతన వస్త్రధారణమై ఆస్థాన వినియోగమునకు శ్రీ విచారణ కర్తల వారు మొదలగు వారు అందరూ కూర్చుని ఉంటారు.
శ్రీవారికి నూతన పంచాంగము శ్రవత పోరుపబడుతుంది పంచాంగమును గుణించిన వారికి బహుమానం ఇస్తూ ఉంటారు తర్వాత కొన్ని స్థలాచార్య పద్ధతులు కలిగి లడ్డు వడ  అప్పడం దోశ మొదలగు ప్రసాదాలు దేవస్థానం మర్యాదల ప్రకారం కైంకర్యలు వారికి బహుమానంగా ఇస్తారు ఆస్థానం ఉదయం 11 గంటలకు పూర్తి అవుతుంది. ఆ స్థానంలో బ్రాహ్మణ ఇతరులు కూర్చుండకూడదు ఆ తర్వాత ధర్మ దర్శనం అవుతుంది అప్పుడు అంతా రావచ్చు  నిత్య ఉత్సవం ఇది సంవత్సరాది మొదటిరోజు జరుగుతుంది ప్రతి సాయంకాలం శ్రీవారికి మాత్రం వెండి తిరిచిలో వేరువేరు వాద్యములతో వేద ప్రబంధ పారాయణాలతో  ఊరు చుట్టూ  ఉత్సవం జరుగుతూ ఉంటుంది.


కామెంట్‌లు