బాల్యాన్ని
కట్టుబానిసత్వాన
ముంచొద్దు
పసితనం అపురూప జ్ఞాపకం
అహంకారులకు
ఎప్పటికీ గెలుపు దక్కదు
అణకువ ఆత్మీయతగలవారికి
ఎప్పటికీ ఓటమన్నదుండదు
ప్రేమ వాగుడు కాయ కాదు
ద్వేషం వదరుబోతు
దానికి నోరు అదుపులో ఉండదు
బస్సంటే
అదినడిచే బ్రతుకుకథలపుస్తకం
గమ్యం రాగానే
కథాస్రవంతికి విరామం
మంచి స్నేహాన్ని
వదలొద్దు
అది హృదయ పూర్వకమైనది
మన వాళ్ళంతా దూరమైనా
నేనున్నాననే
అభయహస్తమది
కాలచక్రం గిర్రున తిరిగింది
ఎదురుపడ్డస్నేహితుల
కళ్ళముందు మెదిలాయి బయోస్కోపై గత స్మృతులు
ఎందుకు నిరాశ
రేపు ఉదయిస్తాడుగా?
సూర్యుడు
సహనం మనిషికిది
ఆ భరణం
నిరాశ నిస్పృహలను
కూడా స్వాగతం పలకాలి కదా!?
కాలమంటేనే
తీపి చేదు జ్ఞాపకాల
సమాహారం
కాలాన్ని తిట్టిపోయకు
కాలాన్ని వాడిచూడు
అది వేడుకవుతుంది
వృధా చేస్తే వేదనౌతుంది
మౌనం అది మనసుభాష
మౌనం స్వీయ అధ్యయనం
మౌనం నిశితపరిశీలనాస్త్రం
మౌనం భవిద్దర్శనం
...న్యాలకంటి నారాయణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి