అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
 ఓ తల్లి ఆవేదన(బిడ్డలకు నివేదన)-
@@@@@@@@@@@@
నాకు అంతా మధుర జ్ఞాపకమే
నాకు నువ్వు తొలిచూలు
కొడుకై పుట్టినప్పుడు
నేను పొందిన ఆనందం ఎంతో

నువ్వు స్నానం చేయనని మారాముచేసేవాడివిరా చిన్నా

సత్తువలేక  నేనిప్పుడు స్నానం చేయలేనంటే నన్నుఈసండించుకుంటావేరా కన్నా

నువ్వు బువ్వ తినేటపుడు కంచంచుట్టు అన్నం మెతుకులు ఎగజల్లితే 
ప్రేమతో నిన్నెత్తుకొని ముద్దాడితిరా చిన్నా

ముసలితనంతో చేతులు పట్టుతప్పి వణుకుపుట్టి బువ్వ కంచంచేజారితే

 బువ్వ నేలపాలైతే నీ నోటికొచ్చినట్టు తిడతావేరా చిన్నా

నేను వంటగదిలో బువ్వొండుతున్నప్పుడు
నువ్వు గుక్కపెట్టిఏడుస్తుంటే
నువ్వేరిగి పూసుకుంటే 

నిన్ను వేడినీళ్లతో స్నానం చేయించి నా  బంగారు కొండ అని ముద్దాడితి గదరా చిన్నా

నా ఒంట్లో రక్తంతా పీల్చినట్లు గంటలకు గంటలకు సన్నొదలక పాలు
త్రాగెటోడివి 
త్రాగి త్రాగి నిద్రలోకి జారుకుందువు

శరీరం పట్టుతప్పి నరాలు బలహీనపడితి
నాకు తెలియకుండానే మూత్రమాగక బట్టతడిస్తే ,ముసలిముండ అని చీదరించుకుంటివిగదరా చిన్నా

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పినవి వట్టి ఆచరణ యోగ్యంకానివని రుజువు చేస్తివి గదరాచిన్నా

పసితనాన నువ్వు బోసినవ్వునవ్వుతుంటే ఎంత ముద్దొస్తువో,నీ ముద్దుమాటలకు మీ అయ్య ఎంత మురిసిపోయెటోడో

నాకు పళ్ళూడి బోసి నవ్వుతో నిన్ను పలుకరిస్తే ముఖం తిప్పుకునిచూస్తావేంరా చిన్నా

ఏళ్ళు ముదిరి కీళ్లుసడలి నడవలేని నాకు నువ్వు  ఏ (ఓ)ఆసరాగా ఉండకపోయినా ఫర్వాలేదు

నేను చచ్చే దాకా ఊతగా ఉంటానని నాకు మాటివ్వరా కన్నా

నన్ను నీ భుజాల మీద మోయమనడంలేదురా చిన్నా

పట్టెడన్నం వేళకు పెడితే‌ అదే పదివేలురా నాన్నా
నేను బ్రతికినన్నాళ్ళు నేను బ్రతుకునురా కన్నా

నిన్నే నా సర్వస్వంగా నమ్ముకున్న
పిచ్చితల్లినిరా నేను 
 నన్ను ఏదిక్కు లేని
ఓల్డ్ ఏజ్ హోంలో వేయకురా కన్నా

నీ చేతిలో చావాలన్న చివరాశ
ఈ అమ్మ కోరిక తీరుస్తావుగదరాకన్నా
రేపుచచ్చినా నీ కడుపున మాత్రం పుట్టునులేరా నాన్నా!?కామెంట్‌లు