అగ్గి రాజేసిందెవడు ఆజ్యం పోసిందెవడు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
మనిషి ఉద్వేగాలని
అదుపు చేసుకోలేక
మనిషి మృగమైతే
విచక్షణ కోల్పోతే
ఇక ముందు ఎన్ని
మణిపూర్ ఘటనలను
కళ్ళచూడవలసి ఉంటుందోగదా?!

నిప్పును రాజేసిందెవడు
అగ్గికి  ఆజ్యం పోసిందెవడు
బుగ్గి పాలవుతున్నది అమాయకులు
పిల్లలు ,మహిళలు
వృద్ధులు, రోగగ్రస్తులు

నిమ్మకు మీరెత్తనట్టున్నా
ఏలికలు
తమ కెందుకి అర్ధాంతర చావు
అనేది అర్థం కాని
అమాయకులు, నిర్భాగ్యులు


ఇవన్నీ స్వార్థంతో జరుగుతున్న
కృత్రిమ ఉద్యమాలా?
బతుకు పోరాటాలా!?
ఎటు  తేల్చుకోలేని సందిగ్ధ
అవస్థలో
ప్రజలు

దేశ ప్రజలారా 
తస్మాత్ జాగ్రత్త
ఈ ఆధిపత్య పోరాటాల్ని
స్వార్థపూరిత వ్యక్తుల కుయుక్తుల్ని
ఎప్పటికప్పుడు పసిగడదాం
రాష్ట్ర దేశ సౌభాగ్యాన్ని
శాంతిభద్రతల్ని
కాపాడుకుందాం2


కామెంట్‌లు