బద్ధకాన్ని వదిలేద్దాం ;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
బద్దకాన్ని
బంగాళాఖాతంలో
విసిరేద్దాం
చలాకితనాన్ని
మన అణువణువునా
పుణికి పుచ్చుకుందాం

ఇంతకాలం
ఈబద్దకం
మన కాలాన్నెంతో
దిగమింగెగదా

నేడుమన బ్రతుకున
 స్తబ్దత నెలకొల్పి
విజయలక్ష్మిని
దరిదాపులకు
రాకుండా అడ్డుకున్నది

ఇక సోయి కొచ్చిన
బద్దకాన్ని బండకేసి కొట్టినం

పట్టుదల,క్రమశిక్షణ
నా జీవితంలో ఒక భాగం చేసుకున్నా
బద్ధకాన్ని జీవ సమాధి చేసిన
జీవితకాలం బతుకును గెలవాలంటే
నిత్యం ఉల్లాసం ,ఉత్సాహం
మ(నా )న మాటల్లో మన చేతల్లో
ప్రదర్శిస్తున్నా
శ్రమయేవజయతే అంటూ
శ్రామకగీతాన్ని ఆలపిస్తున్నా
బద్ధకం హఠావో
జీవితం బచావో అంటూ- 2కామెంట్‌లు