భయపడేటోళ్ళంతా బలహీనులే !?;- అంకాల సోమయ్య దేవరుప్పులజనగాం9640748497
ఎక్కడున్నారీ
సకల చరాచర లోకంలో సత్యమూర్తులు
అంతా స్వాహామూర్తులే

కాలానికి ఎదురీది గెలిచినోళ్ళు
త్యాగాన్ని వారి యింటి పేరుగా
మార్చుకున్నోళ్ళు
సామాజిక చైతన్యానికి నడుంకట్టినోళ్ళు
నిరంతరం బడుగు బలహీనులకై పరితపించేవాళ్ళు

ఎక్కడున్నారీ ధరాతలంలో స్వేచ్ఛకై పోరాడినోళ్ళు

అహింస పరమోధర్మఃఅన్నదైవదూతలు
ఎక్కడున్నారీ వసుధలో

భరతమాత దాస్యశృంఖలాలవిముక్తికై
ఉరితాళ్ళను ముద్దాడిన యువకిశోరాలు

లెక్క తక్కువైతేనేమి నాడు వారి మార్గమెప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యం వైపు
ఒక్కొక్కరుకలిస్తేవందలువేలుకాలేరా!?
సవాళ్లు విసిరేవారేగదా దేశాభిమానులు

భయపడేటోళ్ళంతా బలహీనులే

కలం గళం కలిస్తే కవితైనా పాటైనా
 కవిగాయకులుకలిస్తే వాగ్బాణమైన , నిప్పులు కక్కే గేయమైనా
అణగారిన వర్గాలను ఏకంచేసే
జనరణనినాదం

మాటలు వట్టి పడికట్టు పదాలు కావు
హృదయం దౌర్బల్యాన్ని దూరంచేసే చైతన్యకిరణాలు 
వందేమాతరం మనదే మనదేఈతరం
నవతరం నవలోకం


కామెంట్‌లు