సనాతన ధర్మము వైశిష్ట్యము ;- కవిమిత్ర, శంకర ప్రియ ,-సంచార వాణి:- 99127 67098


 ⚜️సమస్త మానవాళికి
 సుస్థిరశాంతి నొసంగు
    సనాతనమైన ధర్మం!
 శివమస్తు! జయమస్తు! (1)
⚜️విశ్వజనీన మైనది
విశ్వవిఖ్యాతి యైనది 
    విశిష్టమైనదీ ధర్మo!
శివమస్తు! జయమస్తు! (2)
     (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)    
👌మన ధర్మము.. అతిపురాతన మైనది.. నిత్యనూతన మైనది! విశ్వశాంతి కాముకులైన, మన మహర్షులు ప్రతిపాదించింది! కనుక, "ఆర్ష ధర్మం" అనిపేరు! దీనికి "సనాతన ధర్మము" అని;  "భారతీయ ధర్మము" అని, పలు పేరులు!
✅ధర్మస్య జయోzస్తు!
( ధర్మమార్గము నందు, సత్కర్మలను ఆచరించు, సజ్జనులకు విజయము కలుగు గావుత!)
✅అధర్మస్య నాశోzస్తు!
     [అధర్మ మార్గము నందు, దుష్కర్మలను కొనసాగించు, దుర్జనులకు వినాశనము కలుగు గావుత! ]
.... అని, మంత్రద్రష్టలైన మహర్షులయొక్క శుభకామనలు!
🚩సనాతన ధర్మంలో ఉన్న వారందరూ అభ్యుదయము చెందుదురు గాక!  సనాతన ధర్మంయొక్క ఛత్రఛాయలో భారతీయులందరూ క్షేమంగా ఉందురుగాక! 
    భారతదేశమునకు సుస్థిరమైన శాంతి, భద్రతలు లభించుగాక! భారతదేశమునకు ప్రాణమైన సనాతనధర్మం క్షేమంగా వర్ధిల్లు గాక! శివమస్తు!
      🚩సీస పద్యము
భవ్యమౌ మన దివ్య భారత దేశాన
     శాంతి భద్రత లెప్డు సాగు గాక!
 పూతమై వరలు  సనాతన ధర్మంబు 
      వర్ధిల్లు గావుత భారతమున!
నిరత సనాతన నియతిని పాటించు 
    జనుల  కభ్యుదయము జరుగు  గాక!
 ఘన  సనాతన ధర్మమను మార్గ మందున 
    సాగు చుందురు గాక సకల జనులు!
      🚩 ఆట వెలది పద్యం 
కర్మభూమియైన, ఘన భారతంబున
   జనన మొంది నట్టి జనుల కరయ
శాంతి సిరుల మరియు సత్త్వ బుద్ధియు గల్గి 
   క్షితిని  నుంద్రు గాక! క్షేమముగను!!
     [...గోపాలుని మధుసూదనరావు]
         ***********
     🚩 ఉత్పల మాల 
    భారతదేశమందు స్థిరభద్రత శాంతియు కూరుగాక! నా 
    భారతదేశ ప్రాణమగు భవ్య సనాతనధర్మ మెచ్చగున్! 
    భారతధర్మఛత్రమున వర్తిలువారికి 
వృద్ధి సేమముల్ 
      చేరునుగాక! సర్వులకు శీఘ్రముగా ధనధాన్య సంపదల్!!
        [..జి. ఆర్. కె. పరమహంస.,]
     🚩శుభసంకల్పమస్తు!


కామెంట్‌లు