హనుమ ద్వైభవము; -కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచారవాణి: 99127 67098
 🔱శ్రీరుద్రాంశ సంభూతుని
హనుమంతుని వైభవం
 కీర్తించు నోరునొవ్వంగ
జయజయ ఆంజనేయ!
    ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
🌻ఆంజనేయ స్వామి .. అంజనీదేవి కుమారుడు! మహా దేవుడు, దేవ దేవుడైన శ్రీమన్మహా రుద్రునియొక్క అవతార స్వరూపుడు! ఆపద్బాంధవుడు! అగ్నిపునీతయైన, సీతమ్మ జాడను.. దాశరథియైన రామునకు తెలియజేసిన వానరోత్తముడు.. హనుమంతుడు!
🌻 నరులైన, వానరులైన శ్రీస్వామివారి లీలలను భక్తి ప్రపత్తులతో కీర్తించు చున్నాయి! తమజన్మను ధన్యతను కావించుకొను.చున్నాయి! జయజయ ఆంజనేయ!
      🚩ఉత్పల మాల 
    వానరుడైనగాని తన భక్తిని చాటుచు రామనామమున్
     ధ్యానము జేయుచుండె నట, నంజని పుత్రునిదైన స్తోత్రమున్
     మానితరీతి సుందరపు మార్గము నెన్నుచు జేయుచున్న, ఆ
     వానరవీరు నా హనుమ వైభవమున్ స్మరియింప మేల్మియౌ!
          [..డా. శాస్త్రుల రఘుపతి., ]
        **********
🚩మత్త కోకిల వృత్తo
పంజరమ్మది లంకపట్టణవాసి, రావణు చేతిలోన్
 కంజనేత్రుని ప్రేమభామిని కష్టమందున నుండగన్;
 అంజనీ తనయుండు నేగెను, అమ్మ సీతను జూడగన్
 ఆంజనేయుని రామభక్తుని నార్తిమీరగ వేడెదన్!
           [ పద్మ చిగురాల.,]
 🕉️శ్రీ హనుమ!జయ హనుమ! జయజయ హనుమ!

కామెంట్‌లు