మానవత్వంతో మంచి మనిషిగా బతకండి*;- - ప్రభాకర్ రావు గుండవరం ఫోన్ నం.9949267638
నయవంచకుల 
నమ్మక ద్రోహుల
అరాచకుల 
అవినీతి పరుల 
భరతం పట్టే కాలం 
దరి దాపుల్లోనే
ఎన్నో రూపాల్లో 
కాచుకుని కూర్చుని ఉంటూంది 

నాగిణిలా 
ఎప్పుడో టక్కుమని 
కాటేసి విషం 
చిమ్మక మానదు
మాడి మసి చేయక తప్పదు

ఆ సమయం 
గాలంలో చిక్కి 
విల విలా కొట్టుకునే 
చేప పిల్ల కన్నా 
వలలో పడి 
రెక్కలు ముక్కలయేట్లు 
కొట్టుకునే పిట్టల కన్నా 
నరక లోక బాధ కన్నా ఘోరం 
యమ యాతన కన్నా 
భయంకరం మహా భీభత్సమ్

ఖబర్దార్!!!!!
నీతిని నిజాయితీని ఆశ్రయించండి 
న్యాయం ధర్మాన్ని పాటించండి 
మానవత్వంతో మంచి మనిషిగా బ్రతకండి*

కామెంట్‌లు