చిట్టిపొట్టి గేయం;- -గద్వాల సోమన్న,9966414580
చిలుకలా వాలి
చినుకులా రాలి
స్ఫూర్తిని ఇస్తా!
కీర్తిని తెస్తా!

చూపించి జాలి
పాడించి లాలి
తృప్తిని ఇస్తా!
కనువిందు చేస్తా!

గాలిలా వీచి
మనసులే దోచి
అండ నిలుస్తా!
కొండ నవుతా!

మంచి పని చేసి
ముందడుగు వేసి
ఆదర్శమవుతా!
ఆనందమవుతా!

పువ్వులా మారి
క్షేమమే కోరి
యశము పొందుతా!
అక్షరమవుతా!


కామెంట్‌లు